MLG: గోవిందరావుపేట మండలం చల్వాయిలో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఎస్సై కమలాకర్ నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.73,020 నగదు స్వాధీనం చేసుకున్నట్లు SI తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను స్టేషన్కు తరలించామని ఎస్సై కమలాకర్ ఇవాళ పేర్కొన్నారు.