ప్రధాని మోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటా సరిహద్దుల్లో సైనికులతోనే దీపావళి జరుపుకుంటున్నారు. సైనిక దుస్తులు ధరించి, దళాలతో సరదాగా గడుపుతూ స్వీట్లు తినిపించి వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. తొలిసారిగా 2014లో సియాచిన్, 2022లో కార్గిల్, 2023లో లేప్చా, గతేడాది కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళాలను కలిశారు.