BHPL: జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు మంగళవారం వరకు 1,664 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఇవాళ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేపటితో గడువు ముగియనుండగా, నిన్న కేవలం 6 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు. చివరి రోజు దరఖాస్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.