మేడ్చల్ PS పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో షేక్ సాతక్ అనే యువకుడు తన తండ్రిని గొడవల కారణంగా దారుణంగా హత్య చేశాడు. రాజు అనే స్నేహితుడితో కలిసి మద్యం సేవించిన అనంతరం తండ్రితో వాగ్వాదం జరిగి, అది హత్యకు దారితీసింది. ఘటనపై స్పందించిన పోలీసులు, నిందితుడితో పాటు అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.