HYD: పాన్ షాప్ యజమానిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన కంచన్ బాగ్ PS పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పాన్ షాప్ నిర్వహిస్తున్న ఖాజా అనే వ్యక్తి దుకాణాన్ని మూసివేస్తుండగా అక్కడికి వచ్చిన ఇంతియాజ్ ఓపెన్ చేయాలని కోరాడు. అందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి లోనైన ఇంతియాజ్ కత్తితో దాడి చేశాడు. గాయపడిన ఖాజాను ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.