NLG: వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించి వారి ఆదరణను పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ కు చెందిన ఆదిమల్ల హనుక్ పట్టణంలోని బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన “మద్రాస్ ఫిల్టర్ కాఫీ” షాప్లో ఆయన ఆదివారం స్థానిక నేతలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కంప్యూటర్ ద్వారా బిల్లింగ్ విధానాన్ని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.