HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలోని శివ బాలాజీ వైన్స్లో దొంగలు పడ్డారు. వైన్స్ షాప్ ఏర్పాటుచేసిన ఇంటి వెంటిలెటర్ను పగలగొట్టిన దొంగలు, లోపలికి చొరబడి డబ్బులు, మందుబాటిల్లను తీసుకువెళ్లారు. సోమవారం ఉదయం ఇట్టి విషయాన్ని గుర్తించిన వైన్స్ షాప్ నిర్వాహకులు పోలీసులకు సమాచారంను అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.