SKLM: శ్రీకాకుళం పట్టణం సమీపంలో ఉన్న పురుషోత్తం నగర్ కాలనీ రోడ్డు మార్గం అధ్వానంగా తయారైందని స్థానికులు అంటున్నారు. ఈ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరంగా ఉందని వాహనదారులు వాపోయారు. గత 20 ఏళ్లుగా కనీసం రోడ్డు మార్గాన్ని నోచుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.