MNCL: దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో పాడి వ్యవసాయ పశువులకు రైతులు ప్రత్యేక పూజలు చేశారు. వ్యవసాయానికి సహాయకారిగా ఉంటున్న పాడి వ్యవసాయ పశువులకు ప్రతి దీపావళి రోజున పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సోమవారం మండలంలోని చింతపల్లి, తదితర గ్రామాలలో ఉన్న రైతులు వాటి పశువులను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆ పశువులకు వాటికి ఇష్టమైన ఆహారాన్ని తినిపించారు.