JN: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్తున్నా అభివృద్ధి నిధుల గణాంకాలు పేపర్లు, పోస్టర్లకే పరిమితం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు విమర్శించారు. జఫర్గడ్ మండల కేంద్రంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. 2019లో ప్రారంభమైన ఉప్పుగల్ నుంచి పాలకుర్తి వరకు కెనాల్ కాల్వ పూర్తి చేయకపోవడం సిగ్గుచేటన్నారు.