NZB: పోలీసుల ఎన్కౌంటర్లో కానిస్టేబుల్ని హత్య చేసిన నిందితుడు రియాజ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిజామాబాద్ GGHకి సీపీ సాయి చైతన్య చేరుకున్నారు. కాల్పులు జరిగిన రూమ్ నెం 407కి పోయి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. దీంతో అక్కడ జరిగిన విషయంపై కాపలా ఉన్న పోలీసులని అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపై మరి కాసేపట్లో సీపీ మీడియాతో మాట్లాడనున్నారు.