కృష్ణా: గుడివాడ మండలం రామన్నపూడి గ్రామంలో గొల్లపల్లి విజయ్ కుమార్ అనే బాలుడిపై ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా, అకస్మాత్తుగా వీధి కుక్కలు దాడి చేయడంతో బాలుడు గాయపడ్డాడు. స్థానికులు వెంటనే బాలుడిని కాపాడి, చికిత్స నిమిత్తం సోమవారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కలు నియంత్రించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.