ASR: బాణాసంచాను చేతిలో కాకుండా దూరంగా ఉంచి కాల్చాలని అరకు ఏరియా ఆసుపత్రి సూపరింటెండ్ డా. రాము సూచించారు. కాటన్ దుస్తులు ధరించాలని, దగ్గరలో ఇసుక, నీరు ఉండేటట్లు చూసుకోవాలని పేర్కొన్నారు. పెద్దల పర్యవేక్షణలో పిల్లలు బాణాసంచా కాల్చేలా చూడాలన్నారు. మహిళలు దీపాలు వెలిగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కాలిన గాయాలకు వెంటనే చల్లనీటితో శుభ్రం చేయాలన్నారు.