MHBD: తొర్రూరు మండల ప్రజలు దీపావళి పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలని మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు సిరికొండ విక్రమ్ కుమార్ సోమవారం సూచించారు. టపాసులు పేల్చేటప్పుడు యువతీ, యువకులు, చిన్న పిల్లలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.