ATP: పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో సోమవారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ట్రంప్ ఫ్లెక్సీలను దహనం చేశారు. జిల్లా అధ్యక్షులు ఎస్.సూరి మాట్లాడుతూ.. అమెరికా ట్రంప్ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులపై 11% నుంచి 50% వరకు సుంకాలు విధించిన నేపథ్యంలో ట్రంప్ ఫ్లెక్సీలను దహనం చేసి నిరసన చేశామన్నారు.