SKLM: పాతపట్నం మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాలలో ఈనెల 24వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో పలు సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. కావున నిరుద్యోగ యువతీ యువకులు ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.