బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ పార్టీ 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేత తేజస్వీ యాదవ్ వైశాలి జిల్లాలోని రాఘోపూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. కాగా, బీహార్లో నవంబర్ 6, 11వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబరు 14న ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే.