KMR: బిచ్కుంద బస్టాండ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. సోమవారం బస్టాండ్లో స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. అయితే, ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నాలుగు దశాబ్దాలుగా దీనికి ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల తరచూ పైభాగం పెచ్చులు ఊడిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.