కొన్ని చిట్కాలతో కడుపుబ్బరంను తగ్గించుకోవచ్చు. తక్కువ ఆహారం ఎక్కువసార్లు తినడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. టీ, కాఫీలు తాగడం తగ్గించాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ఆహారాన్ని బాగా నమిలి, నెమ్మదిగా తినాలి. పాస్తా, వైట్ బ్రెడ్ వంటివి మితంగా తినాలి. వ్యాయామం చేయాలి. అల్లం టీ, పుదీనా టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.