KDP: రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు జన్మదిన వేడుకలు సిద్ధవటం మండలం భాకరాపేటలోని టీడీపీ నేత కాడే చెంచాయనాయుడు నివాసంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఆ పార్టీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జగన్మోహన్ రాజు నాయకత్వంలో మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించి ఒకే మాట, ఒకే బాటగా నిలవాలని టీడీపీ నేతలు కోరారు.