SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధు శేఖర భారతి మహాస్వామి సోమవారం దర్శించుకున్నారు. అద్దాల మండపంలో పాదుక పూజ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు, భక్తులకు ఆశీర్వచనం గావించి, రాజన్నకు ప్రీతి పాత్రమైన కోడె మొక్కును చెల్లించారు. అనంతరం ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు.