KDP: కడప నగర పరిధిలోని అలంఖాన్ పల్లె సర్కిల్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు కడప నుంచి కమలాపురం వైపు వెళుతున్న ఆర్టీసీ ఆర్డినరీ బస్సు అలంఖానపల్లె సర్కిల్లోకి రాగానే అదుపుతప్పి ముందు వెళుతున్న కంటైనరును ఢీకొంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సు ముందు భాగం దెబ్బతింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సింది.