BDK: సీతంపేట సుజాతనగర్ పంచాయతీల మధ్య వెదుళ్ళ వాగుపై ఉన్న బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో వాహనదారులకు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన బ్రిడ్జి మరమ్మతులు వెంటనే చేపట్టాలని కోరుతూ.. సీతంపేట సుజాతనగర్ ప్రజలు సోమవారం ఆందోళన చేశారు. 2016లో నాటి ప్రభుత్వం ఎదురు వాగుపై నాసిరకంగా బ్రిడ్జి హై లెవెల్ బ్రిడ్జి ఏర్పాటు చేసిందని సీపీఎం మండల కార్యదర్శి వీర్ల రమేష్ తెలిపారు.