GDWL: దీపావళి పండుగను గద్వాల ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పండుగ పూట పిల్లలు పటాకులు కాల్చే సమయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలన్నారు. బాణసంచా కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.