PPM: పట్టణంలో ఇటీవల జరిగిన దీపావళి సామగ్రి పేలుడు ఘటనలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న వారిని అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జె.సౌమ్య జాస్ఫిన్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె గాయపడిన వారితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు.