మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీని తెరకెక్కిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి మేకర్స్ స్పెషల్ పోస్టర్ షేర్ చేస్తూ విషెస్ చెప్పారు. ఇద్దరు చిన్నారులతో కలిసి చిరు సైకిల్ తొక్కుతూ కనిపిస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇక నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.