అన్నమయ్య: చిట్వేలి ఎస్సై నవీన్ బాబు సోమవారం మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని, ప్రజలు పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. చిట్వేలి మండల ప్రజలకు ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు.