AP: చందన బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు చందన మోహనరావు (82) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. వస్త్ర వ్యాపారంలో ఆయన విశేష సేవలు అందించారు. ఆయన మృతి పట్ల పారిశ్రామిక, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.