VZM: జిల్లా ప్రజలందరికీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు మరిపి విద్యాసాగర్ సోమవారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు వెళ్లివిరియాలని, ఆ లక్ష్మీదేవి చల్లని చూపుతో అష్ట ఐశ్వర్యాలు సిద్దించాలన్నారు. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.