SKLM: కవిటి మండలం శహలాలపుట్టుగ వెళ్లే రోడ్డు ప్రమాదకరంగా ఉంది. ఎర్ర చెరువు వద్ద రోడ్డు కుంగింది. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎన్నో రోజులుగా సమస్య ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేయాలని కోరుతున్నారు.