MNCL: నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద రజిత(26)ను ఆమె భర్త కుమార్ గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని బ్రిడ్జిపై నుంచి కిందకు పడేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పరారీలో ఉన్న కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.