MLG: జిల్లా కేంద్రంలోని పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఎస్సై అచ్చు కమలాకర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అధిక సంఖ్యలో ప్రయాణికులతో వాహనాలు నడపడం వల్ల సంభవించే ప్రమాదాల పై వాహనదారులకు అవగాహన కల్పించారు. పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై కమలాకర్ హెచ్చరించారు.