WGL: ఉమ్మడి జిల్లాలో దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాల వద్ద భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు హెచ్చరించారు. మండే వస్తువులను దుకాణాల వద్ద ఉంచరాదని, షాపుల మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండాలని సూచించారు. ప్రతి షాపు వద్ద 4 ఫైర్ బకెట్లు, రెండు పొడి ఇసుకతో, మరో రెండు నీటితో నింపాలని, పొగతాగడం నిషేధించాలని, ఫైర్ స్టేషన్ నంబర్ ఉంచాలని ఆదేశించారు.