KRNL: మంత్రాలయం పాత ఊరిలో శ్రీ రామలింగేశ్వరుడికి సోమవారం అర్చకులు రుద్రాభిషేకాలు, తుంగభద్ర జలాలతో జలాభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. చందనం విభూది మారేడు దళాలు పట్టు వస్త్రాలతో స్వామివారిని అలంకరించారు. 108 బిల్వపత్రాలతో శివ సహస్ర నామార్చన చేశారు. నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులిచ్చారు. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.