PLD: శావల్యపురం-సంతమంగులూరు రైలు మార్గంలో ప్రమాదవశాత్తు జారిపడి సుమారు 30-40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మూడు, నాలుగు రోజుల క్రితం జరిగిందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. సోమవారం స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఆర్పీ ఎస్సై ఎం.రాజమోహన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక మార్చురీకి తరలించారు.