W.G: మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు వైసీపీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉండి మండలం ఎన్.ఆర్.పి. అగ్రహారం, చెరువుగట్టుపాలెంలో సంతకాల సేకరణ చేపట్టారు. ప్రజలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీలో అభివృద్ధి చేస్తే జరిగే నష్టాలను ప్రజలకు వివరించారు. ఇందులో వైసీపీ నాయకులు గలావిల్లి ధనుంజయ, నలబా పోతురాజు పాల్గొన్నారు.