WNP: పానగల్ మండలం దావత్ ఖాన్ పల్లికి చెందిన కొంకల గట్టయ్య ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు. విద్యార్థి దశలో ఏబీవీపీ కార్యకలాపాల్లో పాల్గొంటూనే విద్యపై దృష్టి సారించి ఈ విజయాన్ని సాధించాడు. ప్రజా రవాణా నిర్వహణను రియల్ టైమ్ మెషిన్ లెర్నింగ్ ద్వారా మెరుగుపరచడంపై ఆయన పరిశోధన చేశాడు. దీనికిగాను అతనికి ఈ పట్టా లభించింది.