WGL: HYDలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సోమవారం స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్తో సహా పలువురు నాయకులు ఈ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా నాయకులు ఇప్పటికే జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.