MDCL: సాధారణంగా పండగ రోజు బంతిపూలకు భారీగా డిమాండ్ ఏర్పడి, బంతిపూల ద్వారా గరిష్ట స్థాయిలో ఉంటుంది. కానీ ఈసారి దీపావళి పండుగనాడు ఉప్పల్ పెద్ద మార్కెట్, స్టేడియం, కొత్తపేట ప్రాంతాల్లో బంతిపూల ధర నిన్నటితో పోలిస్తే పడిపోయింది. నిన్న రూ.120 వరకు పలకగా, నేడు రూ.50 నుంచి రూ.80కి చేరింది. ఇందుకు పూల సరఫరా అధికంగా ఉండటం ఓ కారణంగా చెబుతున్నారు.