నెల్లూరు నగరంలోని రాజరాజేశ్వరి ఆలయంలో ఈనెల 21 నుంచి నవంబరు 18వ తేదీ వరకు కార్తిక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో ఉత్సవాల పత్రాలను విడుదల చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సుందరరేశ్వర స్వామి ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈఓ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.