TG: కానిస్టేబుల్ హత్య నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ‘రియాజ్ చికిత్స పొందుతున్న రూమ్ బయట ఉన్న కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. పోలీసులపై అతడు కాల్పులు జరపబోయాడు. రియాజ్ గన్‌ఫైర్ చేసి ఉంటే చాలా మంది ప్రాణాలు పోయేవి. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు ఈ కాల్పులు జరిపారు’ అని స్పష్టం చేశారు.