TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి రోజులలో అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ బాపిరెడ్డి తెలిపారు. కార్తీకమాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు. కావున భక్తులకు సులభతర దర్శనం కల్పించుటకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.ఈనెల 22వ తేదీ నుంచి అమలుచేస్తున్నట్లు వెల్లడించారు.