MNCL: జన్నారం మండలంలో తండ్రిని హత్య చేసిన కొడుకును రిమాండ్కు తరలించామని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. జాదవ్ శంకర్ నాయక్ కుమారుడు నూర్ సింగ్ మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వకపోవడంతో అక్టోబర్ 18న తండ్రిని హత్య చేశాడన్నారు. దీనిపై దర్యాప్తు చేసి తండ్రిని హత్య చేసిన నూర్సింగును కోర్టులో హాజరు పరిచమన్నారు.