WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం కురిసిన భారీ వర్షం వల్ల రోడ్ల పై ఆరబోసిన మొక్కజొన్న పంటలు తడిసి నష్టపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ పలువురు రైతులు మాట్లాడుతూ.. వందల ఎకరాల్లో సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయని, పెట్టుబడి కూడా వసూలు కాకపోవచ్చని ఆందోళన వెలిబుచ్చారు. ప్రభుత్వం తక్షణం స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.