VZM: మెంటాడ మండలంలోని ఆండ్ర జలాశయం నుంచి 400 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో చంపావతి నది పొంగిపొర్లిపోతోంది. దీనివల్ల జగన్నాథపురం, చాకివలస, ఆగూరు, మల్లేడివలస, గూడెం, సారాడవలస, గజపతినగరం మండలాల్లో మర్రివలస గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరమైతే ప్రజలు బయటకు రావోద్దని అధికారులు సూచించారు.