మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ లేడీ ఓరియెంటెడ్ మూవీతో రాబోతున్నారు. యోగేష్ కేఎంసీ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీకి ‘బ్లాక్ గోల్డ్’ టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలియజేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇక హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ మూవీకి శ్యామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు.