ATP: మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా జరిగిందని మాజీ మంత్రి శైలజానాథ్ తెలిపారు. కరోనా సమయంలోనూ ప్రజలకు ఇబ్బంది లేకుండా పథకాలు అందించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రైవేటీకరణ ఆలోచనను మానుకోవాలని అన్నారు.