AP: దీపావళి పండుగ వేళ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి డీఏ (DA) మంజూరు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 1 నుంచి వర్తించేలా DAను 3.64 శాతం పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్ ఆదేశాలు ఇచ్చారు. ఈ DA పెంపు 2024 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.