VZM: కొత్తవలస నుంచి సబ్బవరం వెళ్లే రోడ్డు పూర్తిగా గోతులమయంగా తయారైంది. పాత రైల్వే గేట్ నుంచి నూకాలమ్మ గుడికి వెళ్ళే వరకు రోడ్డు అంతా ఛిద్రం అయ్యింది. సబ్బవరంకు దగ్గర దారి కావడంతో ఈ రోడ్డులో నిత్యం వాహనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వర్షం పడినపుడు గోతులలో వర్షంనీరు నిండిపోవడంతో గోతులు కనబడక ప్రమాద బారిన పడుతున్నామని వాహనచోదకులు వాపోతున్నారు.