SKLM: నరసన్నపేట పట్టణంలో ఉన్న గోరువాని చెరువులో సర్పంచ్ శంకర్రావు ఆధ్వర్యంలో సోమవారం కూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మంగళవారం నుండి కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులకు దీపారాధనలకు ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. అదే విధంగా పట్టణంలో ఉన్న పలు చెరువులలో కూడిక తీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.